Sat Nov 23 2024 01:21:11 GMT+0000 (Coordinated Universal Time)
విచారణను వాయిదా వేయాలని మరోసారి కోరిన సోనియా గాంధీ
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ నుంచి సమన్లు అందాయి. తాను ఇప్పట్లో విచారణకు రాలేనంటూ
విచారణను వాయిదా వేయాలని సోనియా గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను అభ్యర్థించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోరారు. ఇటీవల సోనియా గాంధీ కోవిడ్ పాజిటివ్ రావడంతో.. సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆమెను రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ చేశారు.
సోనియా గాంధీ జూన్ 2 న కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించారు. విచారణకు హాజరు కావడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నుండి మరింత సమయం కోరింది. జూన్ 8న ఆమె ఏజెన్సీ ముందు హాజరు కావాల్సి ఉంది. మరికొంత సమయం కావాలని ఆమె చేసిన అభ్యర్థనకు ఏజెన్సీ అప్పట్లో అంగీకరించింది.
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ నుంచి సమన్లు అందాయి. తాను ఇప్పట్లో విచారణకు రాలేనంటూ సోనియా ఈడీకి లేఖ రాశారు. ఈ వివరాలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొవిడ్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా సోనియా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారని.. అయితే, కొన్నిరోజుల పాటు ఇంటి నుంచి కదలొద్దని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేశారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో, తాను హాజరు కాలేనని, విచారణను మరికొన్ని వారాల పాటు వాయిదా వేయాలని సోనియా గాంధీ నేడు ఈడీకి లేఖ రాశారని జైరామ్ రమేశ్ తెలిపారు.
News Summary - Sonia Gandhi asks Enforcement Directorate To Postpone Questioning
Next Story