Sun Dec 22 2024 19:54:03 GMT+0000 (Coordinated Universal Time)
ఘనంగా ముకేశ్ అంబానీ చిన్నకొడుకు పెళ్లి నిశ్చితార్థం.. పెళ్లికుమార్తె ఎవరంటే..
రాజస్థాన్ లోని నాధ్వారాలో శ్రీనాథ్ జీ టెంపుల్ వద్ద వీరి నిశ్చితార్థం గురువారం జరిగింది. అక్కడి నుంచి వీరిద్దరూ ముంబైలోని
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి పెళ్లి నిశ్చితార్థం జరిగింది. పెళ్లికూతురు ఎవరనుకుంటున్నారా ? ఎంకోర్ హెల్త్ కేర్ సీఈవో వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్. అంబానీ - మర్చంట్ ఫ్యామిలీలు ఈ పెళ్లితో కలవబోతున్నాయి. అనంత్ - రాధిక ల నిశ్చితార్థం రాజస్థాన్ లో జరగ్గా.. ముంబైలోని ముకేశ్ అంబానీ ఆంటీలియా ప్యాలస్ వద్ద నూతన వధూవరులకు ఘన స్వాగతం పలికారు. గురువారం రాత్రి ముకేశ్ అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన పార్టీకి బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
రాజస్థాన్ లోని నాధ్వారాలో శ్రీనాథ్ జీ టెంపుల్ వద్ద వీరి నిశ్చితార్థం గురువారం జరిగింది. అక్కడి నుంచి వీరిద్దరూ ముంబైలోని ఆంటీలియాకు చేరుకోగా.. మేళతాళాలతో ఘనస్వాగతం లభించింది. కాగా.. అనంత్ - రాధిక లు చాలా కాలంగా మంచి స్నేహితులు. ఇద్దరి మనసులు కలవడం, పెద్దలకు కూడా వీరిజంట నచ్చడంతో వివాహాన్ని నిశ్చయించారు. ఈ పార్టీకి షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్, అలియాభట్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ, మికా సింగ్, జాన్వీకపూర్ తదితరులు పార్టీకి విచ్చేశారు. ఇక ముకేశ్ - నీతూ అంబానీలకు ముగ్గురు సంతానం కాగా.. ఆకాశ్ అంబానీ, ఇషా అంబానీ కవలలు. వారిద్దరికీ పెళ్లిళ్లైపోగా.. ఇటీవలే ఇషా కవలలకు జన్మనిచ్చింది.
Next Story