Sun Mar 16 2025 23:58:24 GMT+0000 (Coordinated Universal Time)
సైఫ్ రియల్ హీరో.. అంత రక్తం వస్తున్నా?
బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పై దాడి కేసులో నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ పై దాడి కేసులో నిందితుడిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని విచారిస్తున్నట్లు తెలిసింది. దాడి చేయడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు సైఫ్ ఆలీఖాన్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని లీలావతి వైద్యులు తెలిపారు. ఆయనను ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు తరలించనున్నామని తెలిపారు.
కత్తితో బలంగా ...
బలంగా కత్తితో పొడవటంతో వెన్నుముక పక్కన సైఫ్ ఆలీఖాన్ కు గాయమయిందని వైద్యులు హెల్త్ బులిటిన్ లో తెిపారు. సైఫ్ వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, వెన్నముకలో ఫ్లూయిడ్ లీకేజీని అరికట్టగలిగామని, సైఫ్ వెన్నుముకకు ఎలాంటి గాయం కాలేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. సిసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి ముంబయిలోనే అదుపులోకి పోలీసులు తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు వేగంగా కొనసాగిస్తున్నారు. సైఫ్ ఆలీఖాన్ కు తీవ్రగాయాలయినా ఆయన ఆసుపత్రికి ఆటోలో రావడాన్ని వైద్యులు ప్రశంసించారు. ఆయన ధైర్యాన్ని కొనియాడారు.
Next Story