Sat Dec 21 2024 00:13:02 GMT+0000 (Coordinated Universal Time)
అమితాబ్, అనుష్క లకు లిఫ్ట్ ఇచ్చిన బైకర్స్ కు రూ.10 వేలు జరిమానా
స్టార్లకు లిఫ్ట్ ఇచ్చినందుకు జరిమానా పడిందనుకుంటే పొరపాటే. ఆ సమయంలో వాళిద్దరూ హెల్మెట్ ధరించకపోవడమే..
బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మలకు లిఫ్ట్ ఇచ్చిన ఇద్దరు బైకర్లకు ముంబై ట్రాఫిక్ పోలీస్ విభాగం జరిమానా వడ్డించింది. స్టార్లకు లిఫ్ట్ ఇచ్చినందుకు జరిమానా పడిందనుకుంటే పొరపాటే. ఆ సమయంలో వాళిద్దరూ హెల్మెట్ ధరించకపోవడమే అందుకు కారణం. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అనుష్కకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తికి రూ.10,500 జరిమానా పడింది. అమితాబ్ కు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై ఎంత జరిమానా విధించారో తెలియరాలేదు.
ట్రాఫిక్ ను తప్పించుకొని అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకోవడానికి అమితాబ్, అనుష్కలు ఇటీవల తమ కారు దిగి, రోడ్డు మీద బైక్ పై వెళ్తున్న వ్యక్తులను లిఫ్ట్ అడిగి వెళ్లారు. అమితాబ్, అనుష్కలు ఎక్కిన బైక్ లు నడిపే వ్యక్తులు హెల్మెట్లు ధరించలేదు. దాంతో వారిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఇద్దరూ హెల్మెట్లు పెట్టుకోలేదని ఫిర్యాదులు అందడంతో.. వారికి జరిమానా విధించారు.
Next Story