Mon Dec 23 2024 14:52:14 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ముంబైలో తొలికేసు నమోదు !
తాజాగా భారత్ లో తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదైంది. అలాగే కాపా అనే మరో వేరియంట్ నూ ..
న్యూ ఢిల్లీ : భారత్ లో ఒమిక్రాన్ కొత్తవేరియంట్ కలవరం మొదలైంది. రెండ్రోజుల క్రితమే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా పేర్కొన్న ఎక్స్ఈ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తుందని, ఫోర్త్ వేవ్ కు ఇదే కారణం కావొచ్చని ప్రపంచ ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. తాజాగా భారత్ లో తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదైంది. అలాగే కాపా అనే మరో వేరియంట్ నూ ముంబై లో గుర్తించారు వైద్యులు.
కరోనా లక్షణాలున్న ఇద్దరికీ వైద్య పరీక్షలు చేయగా.. ఒకరికి ఎక్స్ఈ వేరియంట్, మరొకరికి కాపా వేరియంట్ సోకినట్లు నిర్థారించారు. దీంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జనవరిలో యూకేలో ఎక్స్ఈ కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఇప్పుడు ఈ కేసులు బయటపడుతుండటంతో ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా పాండమిక్ తప్పదన్న సంకేతాలొస్తున్నాయి. జూన్ నుంచి ఫోర్త్ వేవ్ మొదలవుతుందని గతంలో జారీ అయిన హెచ్చరికలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొత్తవేరియంట్లు దేశ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
Next Story