Sat Nov 23 2024 04:18:50 GMT+0000 (Coordinated Universal Time)
బప్పీ లహరిని బలితీసుకున్న ఓఎస్ఏ వ్యాధి.. ఇంతకీ ఏంటది ?
అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్య ఉన్నవారు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఉండగా.. ఉండగా ఇది వారి గుండె పనితనంపై దెబ్బతీ..
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పీ లహరి గతరాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాయకీయ, పారిశ్రామిక వేత్తలు సంతాపం ప్రకటించారు. కాగా.. బప్పీ లహరి అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఓఎస్ఏ)తో మరణించినట్లు వైద్యులు తెలిపారు. అసలు ఈ వ్యాధి ఏంటో చాలా మందికి అవగాహన లేదు. స్లీప్ అప్నియాలోనే ఇదొక రకం. ఓఎస్ఏ గా పిలవబడే ఈ వ్యాధి ఉన్నవారు నిద్రిస్తున్న సమయంలో అప్పర్ ఎయిర్ వేస్ (శ్వాస తీసుకునే ఎగువ భాగంలో) బ్లాక్ అవుతాయి. దీంతో గాలి తీసుకునే మార్గాన్ని మరింత వ్యాకోచింపచేసి, గాలిని ఊపిరితిత్తుల్లోకి పంపించేందుకు వీలుగా ఛాతీ కండరాలు బలంగా పనిచేస్తాయి. దీంతో పెద్ద జెర్కింగ్ చప్పుడుతో లేచి గాలి తీసుకుంటారు.
అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా సమస్య ఉన్నవారు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఉండగా.. ఉండగా ఇది వారి గుండె పనితనంపై దెబ్బతీస్తుంది. అబ్ స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్నవారికి శ్వాసనాళాల ఎగువ భాగం అడ్డంకికి గురవుతుంది. గాలి సరిపడా అందకపోవడంతో లేచి గాలి తీసుకోవాలంటూ మెదడు అదే పనిగా సంకేతాలు ఇస్తుంటుంది. నిద్ర సమయంలో గొంతు భాగంలో సాఫ్ట్ టిష్యూ వ్యాకోచించడం వల్ల గాలి వెళ్లే మార్గానికి అడ్డుపడుతుంది. స్థూలకాయం, టాన్సిల్స్ వాపునకు గురికావడం, ఎండోక్రైన్ డిజార్డర్లు, గుండె విఫలం కావడం వంటి సమస్యలున్న వారికి ఓఎస్ఏ ఎదురవుతుంది. పెద్దగా గురకపెట్టడం స్లీప్ అప్నియాకు సంకేతంగా చూడాలి.
Also Read : రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ అసహనం
ఈ వ్యాధికి పరిష్కారంగా వైద్యులు ఒక పరికరాన్ని సూచించిస్తుంటారు. ఆ పరికరాన్ని తలకు ధరించి పడుకుంటే శ్వాస నాళాల్లోకి పాజిటివ్ ప్రెజర్ ను పంపిస్తుంది. దాంతో అవి తెరచుకుంటాయి. దీనివల్ల గురక రాకుండా, శ్వాసకు ఇబ్బంది లేకుండా మంచిగా నిద్రపోవచ్చు. దీనికి శస్త్రచికిత్స కూడా ఉంది. బరువు తగ్గించుకోవడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. స్లీప్ అప్నియా బాధితుల జీవిత కాలం 12-15 ఏళ్లపాటు తగ్గుతుందని పలు పరిశోధనలు వెల్లడించాయి.
Next Story