ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు
16, 21 సంవత్సరాల వయస్సు గల ముస్లిం జంటకు వారి కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పిస్తూ, పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం నాడు
యువతుల వివాహ వయస్సుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతులు తమకు ఇష్టమైన యువకుడిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఇదే విషయాన్ని ప్రస్తావించిన హైకోర్టు... ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకునేందుకు అర్హురాలేనని తేల్చి చెప్పింది. 16 ఏళ్లు నిండిన ఓ యువతి తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని తమకు రక్షణ కల్పించాలంటూ పంజాబ్, హర్యానా కోర్టును ఆశ్రయించింది. సదరు యువతి పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు షరియా చట్టాన్ని ఉటంకిస్తూ వారి వివాహాన్ని గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతికి తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది.