Mon Nov 18 2024 12:42:11 GMT+0000 (Coordinated Universal Time)
నోరూరించే మటన్ వంటకాలు.. తిన్నోళ్లకి తిన్నంత.. వాళ్లకి మాత్రం నో ఎంట్రీ
అన్నం, మటన్ ముక్కలను రాశులుగా పోసి.. తిన్నవాళ్లకి తిన్నంత వడ్డిస్తారు. అయితే.. ఆ ఆలయంలోకి..
నోరూరించే మటన్ వంటకాలు.. తిన్నోళ్లకి తిన్నంత వడ్డిస్తారు. మటన్ ప్రియులకు ఇదొక ఫెస్టివల్. కానీ అక్కడికి మహిళలకు నో ఎంట్రీ. ఇంతకీ ఇదంతా ఏంటి అనుకుంటున్నారా ? అసలు విషయంలోకి వెళ్తే.. తమిళనాడులోని మధురై జిల్లాలోని తిరుమంగళలంలో ఉన్న కరుప్పయర్ ముత్తయ్య ఆలయం ఉంది. తిరుమంగళం తో పాటు మధురై జిల్లా వ్యాప్తంగా ఉన్న పురుషులంతా ఈ ఆలయంలో జరిగే వేడుకలకు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఏటా మార్గళిమాసంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు వేట పోతులను ఆలయానికి తీసుకొస్తారు.
ఉత్సవాల సమయంలో స్వామి వారికీ మొక్కుకున్న మేకపోతులతో నాన్ వెజ్ విందు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో కేవలం పురుషులు మాత్రమే పాల్గొంటారు. అన్నం, మటన్ ముక్కలను రాశులుగా పోసి.. తిన్నవాళ్లకి తిన్నంత వడ్డిస్తారు. అయితే.. ఆ ఆలయంలోకి స్త్రీలు ప్రవేశించకూడదు. స్వామివారిని స్త్రీలు దర్శించుకోవాలంటే.. ఒక నిబంధన పాటించాలి. నాన్ వెజ్ విందు పూర్తి ఆయన తరువాత పురుషులు ఇస్తరులు తీయకుండా అక్కడనుండి వెళ్లిపోతారు. అవి పూర్తిగా ఎండిపోయే వరకు స్త్రీలు ఆపరిసర ప్రాంతాలకు వెళ్లకూడదు.
ఇస్తరులు పూర్తిగా ఎండిపోయి కనుమరుగైన తరువాత మాత్రమే స్త్రీలకు ఆలయ ప్రవేశం ఉంటుంది. పురుషులు యథావిధిగా వచ్చే సంవత్సరం మొక్కు కోసం ఇప్పటినుంచే మేకపోతులని సంవత్సరకాలం పాటు పెంచుతారు. వందల ఏళ్ల నాటి నుండి ఈ పండుగను ఇదే ఆచారంతో జరుపుకుంటున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న పురుషులకు.. కోరిన కోరికలు తీరుతాయని అక్కడివారి నమ్మిక.
Next Story