Mon Dec 23 2024 03:55:42 GMT+0000 (Coordinated Universal Time)
భూగర్భం నుంచి వింత శబ్దాలు.. భయాందోళనలో స్థానికులు
మహారాష్ట్రలోని లాతూర్ లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీలోని వివేకానంద్ చౌక్ బుధవారం ఉదయం ఆఫీసులకు..
ఇటీవల టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సృష్టించిన పెను విషాదం గురించి తెలిసిందే. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా భారత్ లోని ఓ రాష్ట్రంలో భూమిలో నుంచి వింత శబ్దాలు వినిపించాయి. దాంతో స్థానికులు అవి దేవినికి సంకేతమోనని భయంతో వణికిపోతున్నారు. మహారాష్ట్రలోని లాతూర్ లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీలోని వివేకానంద్ చౌక్ బుధవారం ఉదయం ఆఫీసులకు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో హడావిడిగా ఉంది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలో భూమి లోపలి నుంచీ వింత శబ్దాలు వినిపించాయి.
దాదాపు 15 నిమిషాలపాటు శబ్దాలు వినిపించాయి. ఈ విషయం క్షణాల్లోనే సిటీ అంతా తెలిసిపోయింది. దాంతో సిటీలోని జనాలంతా.. భూకంపం వస్తుందేమోనని భయంతో వణికిపోయారు. స్థానిక అధికారులకు వింత శబ్దాలపై సమాచారమివ్వగా.. డిజాస్టర్ మేనేజ్మెంట్ కు సంబంధించిన నిపుణులు వివేకానంద్ చౌక్ చేరుకుని పరిశోధన చేపట్టారు. భూగర్భంలో ఎలాంటి సీస్మిక్ యాక్టివిటీ జరిగిన సూచనలు కనిపించలేదని అధికారులు తెలిపారు. అలాగే భూకంపం వచ్చే సూచనలు కూడా లేవని డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖకు చెందిన ఔరద్ షహజ్ని, ఆశివ్ స్పష్టం చేశారు.
Next Story