Mon Dec 23 2024 11:15:17 GMT+0000 (Coordinated Universal Time)
Union Cabinet : మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ... హ్యాట్రిక్ పీఎం
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మూడోసారి ఆయన ప్రధాని అయ్యారు
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మూడోసారి ఆయన ప్రధాని అయ్యారు. భారత్ లో వరసగా మూడుసార్లు ప్రధాని అయి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. 2014కు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగి పార్టీ విజయానికి కృషి చేశారు. ప్రధాని అయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి పార్టీని గెలిపించి బీజేపీకి అత్యధిక స్థానాలను తెచ్చిపెట్టి మరోసారి ప్రధాని బాధ్యతలను చేపట్టారు. పదేళ్ల పాటు ఆయన ప్రధానిగా బాధ్యతలను నిర్వహించారు. మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది.
రాష్ట్రపతి భవన్ లో...
దీంతో ఆయన మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టి ఇటు బీజేపీకి హ్యాట్రిక్ విజయం అందించడమే కాకుండా.. ఆయన కూడా హ్యాట్రిక్ పీఎం అయ్యారు. 2002లో గుజరాత్ ఎమ్మెల్యేగా ఎన్నికయి ప్రారంభించిన మోదీ రాజకీయ ప్రస్థానం ఇరవై రెండేళ్ల నుంచి ఓటమి ఎరగకుండా నడుస్తూనే ఉంది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఆయన ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యారు.
Next Story