Sun Dec 22 2024 18:33:39 GMT+0000 (Coordinated Universal Time)
హిమాచల్ ప్రదేశ్లో మోదీ పర్యటన
నేడు హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు
నేడు హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానంగా కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంబ్ అందౌరా నుంచి న్యూఢిల్లీ వరకూ ఈ ఎక్స్ప్రెస్ నడవనుంది. దేశంలో ప్రవేశ పెట్టిన వందేభారత్ రైళ్లలో ఇది నాలుగోదని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
కార్యక్రమాలు ఇవే...
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభంతో పాటు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా జాతికి ప్రధాని నరేంద్ర మోదీ అంకితం చేయనున్నారు. దీంతో పాటు బల్క్ డ్రగ్ పార్క్ కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం చంబాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రెండు జలవిద్యుత్తు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story