Wed Mar 26 2025 22:39:12 GMT+0000 (Coordinated Universal Time)
శరద్ పవార్ కు కరోనా పాజిటివ్
కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ గా తేలిందని శరద్ పవార్ వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాల్లోనూ కరోనా వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కూడా కొవిడ్ బారినపడ్డారు. కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ గా తేలిందని శరద్ పవార్ వెల్లడించారు. డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నానని, తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు శరద్ పవార్. అలాగే ఇటీవల తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Next Story