Mon Dec 23 2024 05:11:43 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్ఐఏ సోదాలు.. వారి కోసమేనా?
నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలను నిర్వహిస్తుంది.
నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ దేశంలోని పలు ప్రాంతాల్లో సోదాలను నిర్వహిస్తుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అరవైకి పైగా ప్రాంతాల్లో సోదాలు జరుపుతోంది. తీవ్రవాద సంస్థ అయిన ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి కోసం జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు వెదుకుతున్నారు.
తమిళనాడు, కర్ణాటకలో...
ఐసిస్ ఉగ్రవాదులు వీడియోల ద్వారా వీరిని ప్రభావితం చేస్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో కోయంబత్తూర్ కారు సిలిండర్ పేలుడుకు ంబంధించిన కేసులో ఎన్ఐఏ అధికారులు ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది. కర్ణాటకలో 45కి పైగా ప్రాంతాల్లో సోదాలను చేస్తున్నారు.
Next Story