Thu Feb 20 2025 23:33:43 GMT+0000 (Coordinated Universal Time)
Bengaluru : బెంగళూరులో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాద కుట్ర భగ్నం
కర్ణాటకలోని బెంగళూరులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహిస్తుంది.

కర్ణాటకలోని బెంగళూరులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహిస్తుంది. ఉగ్రవాద కుట్ర కేసులో భాగంగా బెంగళూరులో ఎన్ఐఏ అధికారులు ఉదయం నుంచి తనిఖీలను నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న దాడుల్లో భాగంగా బెంగళూరులోనూ ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది ఐసిస్ కుట్రలను భగ్నం చేసే చర్యల్లో భాగంగానే ఈ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కీలక పత్రాలను...
మహారాష్ట్ర, కర్ణాటకల్లోని నలభై నాలుగు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలను నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ పదిహేను మందిని అరెస్ట్ చేశారు. ఈ సోదాల్లో నగదుతో పాటు తుపాకీలు కూడా ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. కొన్ని కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు జరుగుతున్న కుట్రను ఛేదించేందుకే ఈ సోదాలు జరుగుతున్నాయి.
Next Story