Mon Dec 23 2024 05:25:21 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: దేశంలో మరోసారి ఎన్ఐఏ సోదాలు
దేశ వ్యాప్తంగా మూడో విడత నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహిస్తుంది. 25 ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తుంది.
దేశ వ్యాప్తంగా మూడో విడత నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ సోదాలను నిర్వహిస్తుంది. దేశంలోని 25 ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహిస్తుంది. పీఎఫ్ఐ సంస్థల కార్యాలయాలతో పాటు కార్యకర్తల ఇళ్లలో కూడా ఎన్ఐఏ సోదాలు జరుపుతుంది. ఆరు నెలల్లోనే పీఎఫ్ఐ సంస్థల్లోకి 120 కోట్ల రూపాయలు నిధులు చేరినట్లు కనుగొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలపై దాడికి కుట్ర పన్నినట్లు కూడా ఆరోపణలున్నాయి.
ఈడీతో కలసి....
ఈ సోదాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులతో కలసి ఎన్ఐఏ అధికారులు ఈ దాడులు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోదీ పాట్నా పర్యటనలో దాడికి కుట్ర పన్నినట్లు కూడా ఎన్ఐఏ విచారణలో తేలింది. దీంతో మరోసారి ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. వివిధ రకాల కోణాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే అవకాశాలున్నాయి.
Next Story