Tue Dec 24 2024 17:48:23 GMT+0000 (Coordinated Universal Time)
నేషనల్ షూటర్ కోనికా లాయక్ ఆత్మహత్య
నేషనల్ షూటర్ కోనికా లాయక్ కోల్ కతాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
నేషనల్ షూటర్ కోనికా లాయక్ కోల్ కతాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కోల్ కతాలో తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్కడ లభించిన సూసైడ్ నోట్ లో కోనికా ఇలా రాసింది. "కొంతకాలంగా షూటింగ్ లో రాణించలేకపోతున్నాను. అమ్మా.. నాన్న ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి." అని రాసి.. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. కాగా.. కోనికా లాయక్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు తరలించారు. ఆమె ఆకస్మిక మరణంతో కోనికా తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
ప్రాక్టీస్ కు పది రోజులుగా...
కోనికా ఆత్మహత్య ఘటనపై ఆమె కోచ్ జాయ్దీప్ ట్రిబ్యూన్ స్పందించారు. ఆమె గత 10 రోజులుగా తన ప్రాక్టీస్ సెషన్లకు రెగ్యులర్‌గా రావడం లేదని తెలిపారు. ఆమె ప్రాక్టీస్‌లో బాగానే రాణిస్తున్నారు.. కానీ ఈ మధ్య కొద్ది రోజులుగా ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వస్తున్నట్లుగా తెలిపారు. వెనుకబడిన జార్ఖండ్ ప్రాంతంలోని ధన్‌బాద్ నుంచి వచ్చిన కోనియా జాతీయ పోటీల్లో సత్తా చాటిన వారిలో కోనికా ఒకరని, ఆమె రాష్ట్ర స్థాయిలో మూడుసార్లు గోల్డ్ మెడల్ గెల్చుకున్నారని తెలిపారు.
నాలుగు నెలల్లో...
కాగా.. 4 నెలల్లో ఇది నాల్గవ ఆత్మహత్య ఘటన. ఖుషీరత్ కౌర్ సంధు, హునర్‌దీప్ సింగ్ సోహల్ , నమన్వీర్ సింగ్ బ్రార్ కూడా ఆత్మహత్యతో మరణించారు. వీరంతా రాష్ట్ర స్థాయి షూటర్లు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే బాలీవుడ్ స్టార్ సోనూసూద్ కోనికా కు రైఫిల్ ను బహుకరించారు. ఆ సమయంలో కోనికా పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. జాతీయ స్థాయిలో షూటింగ్ పోటీలకు ఎంపికైనప్పటికీ తన వద్ద మంచి రైఫిల్ లేదని సోనూసూద్ కు ట్విట్టర్ ద్వారా తెలుపడంతో అత్యంత విలువైన రైఫిల్ ను ఆయన కోనికాకు గిఫ్ట్ గా ఇచ్చారు.
- Tags
- konika kaik
- died
Next Story