Fri Nov 22 2024 22:24:56 GMT+0000 (Coordinated Universal Time)
Naveen Patnaik : అరుదైన నేత తనను ఓడించిన నేతను ప్రశసించిన మాజీ సీఎం
నవీన్ పట్నాయక్ మొన్నటి వరకూ ఓటమి ఎరుగరు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిశాకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
నవీన్ పట్నాయక్ మొన్నటి వరకూ ఓటమి ఎరుగరు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఒడిశాకు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో ఆయన పార్టీ బిజూ జనతాదళ్ ఓటమి పాలయింది. అయినా ఆయన కుంగిపోలేదు. నీరసించి ఎందుకీ ఫలితం అని నీరసపడలేదు. నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి మోహన్ మాఝీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. తనను ఓడించిన బీజేపీ నేతల మధ్యనే ఆయన ఉండి ఆ కార్యక్రమాన్ని వీక్షించారు. తన సలహాలు, సూచనలను రాష్ట్ర అభివృద్ధి కోసం ఇస్తానని చెప్పి వచ్చేశారు.
అసెంబ్లీ సమావేశాల...
ఒడిశా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మరొక అరుదైన ఘటన చోటు చేసుకుంది. మొన్నటి ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. గంజాం జిల్లాలోని హింజలి, బొంగీర్ జిల్లాలోని కంటాంబంజి నుంచి పోటీ చేవారు. హింజలిలో ఆయన గెలుపొందారు. కానీ కంటాబంజిలో బీజేపీ అభ్యర్థి చేతలో ఓటమి పాలయ్యారు. అయితే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చిన నవీన్ పట్నాయక్ ను తనకు ఎదురైన బీజేపీ నేత లక్ష్మణ్ బాగ్ పలుకరించారు.
అభనందనలు తెలిపి...
తాను కంటాబంజి స్థానం నుంచిగెలిచిన ఎమ్మెల్యేనని ఆయన నవీన్ కు పరిచయం చేసుకున్నారు. లేచి నవీన్ పట్నాయక్ కు నమస్కరించారు. దీంతో ఆయన మీరేనా నన్ను ఓడించింది అభినందనలు అంటూ లక్ష్మణ్ బాగ్ తో అన్నారు. ఆయనకు నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భారతదేశ రాజకీయాల్లో ఇటువంటి వాతావరణం అవసరం అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఓటమికి సాకులు వెతుక్కోకుండా ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించడం అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Next Story