Sat Dec 21 2024 00:00:16 GMT+0000 (Coordinated Universal Time)
Navodaya : అబ్బ ఎంత జీతమో.. ఊరిస్తున్నాయి.. ఎన్ని ఉద్యోగాలో.. ఇప్పుడే అప్లయ్ చేసుకోండి
నవోదయ పాఠశాలల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. భారీ జీతంతో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు
ప్రభుత్వ ఉద్యోగమంటే చాలు.. ఎవరికి మాత్రం ఇష్టముండదు. అందులోనూ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగమంటే ఆషామాషీ కాదు. ఇక్కడ ఉద్యోగం దొరికితే జీవితం సెటిలయినట్లే. భారీ జీతంతో పాటు ఎన్నో ప్రయోజనాలు. జీతానికి జీతం.. సెలవులకు సెలవులు.. ఒక్కటేమిటి లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి సర్కార్ కొలువు దొరికితే చాలు అని భావిస్తున్న వారికి గుడ్ న్యూస్. దేశంలోని నవోదయ విద్యాలయాల్లో నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. దేశంలో మొత్తం 1,377 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవోదయ విద్యాలయ సమితి అప్లికేషన్లను స్వీకరించనుంది. అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది.
ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు
ఫిమేల్ స్టాఫ్ నర్స్ - 121
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ - 5
ఆడిట్ అసిస్టెంట్ - 12
జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ - 4
లీగల్ అసిస్టెంట్ - 1
స్టెనోగ్రాఫర్ - 23
కంప్యూటర్ ఆపరేటర్ - 2
క్యాటరింగ్ సూపర్ వైజర్ - 78
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 381
ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ - 128
ల్యాబ్ అసిస్టెంట్ - 161
మెస్ హెల్పర్ - 442
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 19
అర్హతలివే
పదో తరగతి, పన్నెండో తరగతి, డిప్లొమా, బాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఎంపిక ఇలా :
రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులయిన వారికి ఇంటర్యూతో పాటు డాక్యుమెంట వెరిఫికేషన్ తర్వాత వైద్య పరీక్షలను కూడా నిర్వహిస్తారు. పరీక్ష కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుందని, తప్పుగా ప్రశ్నకు సమాధానమిస్తే పావు మార్కును కట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు :
అయితే అర్హులైన వారు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫిమేల్ స్టాఫ్ నర్సు పోస్టులకు 1500, మిగిలిన పోస్టులకు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం ఐదు వందల రూపాయలు ఫీజుగా నిర్ణయించారు.
పరీక్ష కేంద్రాలు :
దేశ వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నంలలో నిర్వహిస్తారు.
Next Story