Sun Dec 22 2024 11:58:19 GMT+0000 (Coordinated Universal Time)
శరద్ పవార్ రాజీనామా.. సంచలనమే
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ప్రకటించారు కూడా. తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు. అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని శరద్ పవార్ తీసుకున్న నిర్ణయంతో పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. పార్టీ పదవి నుంచి తప్పుకుంటానని, ప్రజా జీవితం నుంచి కాదని ఆయన చెబుతున్నారు. పవార్ రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
కుమార్తె కోసమేనా...?
వయసు మీద పడుతుండటం, అనారోగ్యం కారణంగానే శరద్ పవార్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారని తెలుపుతున్నారు. తన కుమార్తె సుప్రీయా సూలేకు అధ్యక్ష పదవిని కట్టబెట్టేందుకే శరద్ పవార్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారమూ ఉంది. మరి అసలు కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల తన మేనల్లుడు అజత్ పవార్ బీజేపీలో నలభై మంది ఎమ్మెల్యేలతో చేరతారన్న వార్తల నేపథ్యంలో శరద్ పవార్ ఈ ప్రకటన చేశారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. పార్టీ నేతలు మాత్రం రాజీ చేయవద్దంటూ పెద్దయెత్తున నినాదాలు చేస్తున్నారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Next Story