Sat Mar 15 2025 20:10:28 GMT+0000 (Coordinated Universal Time)
NDA : ముగిసిన ఎన్డీఏ నేతల సమావేశం.. మోదీనే ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ముగిసింది

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ సమావేశం ముగిసింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. మోదీని మూడోసారిగా ప్రధాని పదవిని స్వీకరించడానికి అన్ని భాగస్వామ్యపక్షాలు అంగీకరించాయి.
గంటన్నర సేపు...
దాదాపు గంటన్నరసేపు సాగిన ఈ సమావశంలో అనేక అంశాలపై చర్చించారు. అన్ని భాగస్వామ్య పక్షాలు మోదీ ప్రధాని పదవిని చేపట్టడానికి అంగీకారం తెలిపినట్లు తెలిసింది. మే 8వ తేదీన ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలందరూ వివిధ అంశాలపై చర్చించారని తెలిసింది.
Next Story