Fri Nov 22 2024 22:36:11 GMT+0000 (Coordinated Universal Time)
NDA : నేడు ఎన్డీఏ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
నేడు ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు కూడా హాజరు కానున్నారు.
నేడు ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ మిత్ర పక్షాలతో పాటు ఆ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యులు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చ జరుగుతుంది. మహాకూటమి నాయకుడిగా మోదీని ఈ సమావేశంలో ఎన్నుకోనున్నారు. కొత్తగా ఎంపికయిన ఎంపీలందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. అనంతరం ఎన్డీఏ నేతలందరూ కలసి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలసి ప్రభుత్వ ఏర్పాటకు అనుమతించాలని కోరనున్నారు. తమకు సరిపడా సంఖ్యాబలం ఉండటంతో తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.
మంత్రి పదవుల విషయంలో...
ఇప్పటికే ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ సమావేశంలో కేంద్రంలో భాగస్వామ్యులయ్యే అంశంతో పాటు కీలక మంత్రి పదవులును కూడా కోరే అవకాశముంది. టీడీపీ, జేడీయూలు కేంద్ర మంత్రి వర్గంలో ముఖ్యమైన స్థానాలను కోరనున్నారు. దీనిపై ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్యనేతలతో చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో నాలుగు మంత్రి పదవులు కోరుతుంది.
Next Story