Mon Dec 23 2024 10:57:28 GMT+0000 (Coordinated Universal Time)
తీహర్ జైలులో ఖైదీల మిస్సింగ్.. ఆచూకీ తెలిపిితే బహుమతి
తీహార్ జైలులో దాదాపు 2,400 మంది ఖైదీలు మిస్ అయ్యారు. పెరోల్ పై వెళ్లి ఇక జైలుకు తిరిగి రాలేదు
తీహార్ జైలులో దాదాపు 2,400 మంది ఖైదీలు మిస్ అయ్యారు. పెరోల్ పై వెళ్లి ఇక జైలుకు తిరిగి రాలేదు. దీంతో మిస్సయిన ఖైదీల ఆచూకీ చెప్పిన వారికి ఢిల్లీ పోలీసులు బహుమతిని కూడా ప్రకటించారు. తీహార్ జైలులో 2020 లో వచ్చిన కరోనా సందర్భంగా దాదాపు ఆరు వేల మంది ఖైదీలకు పెరోల్ లభించింది. పెరోల్ సమయం పూర్తి కాగానే తిరిగి వాళ్లు జైలుకు రావాల్సి ఉంటుంది. కానీ ఆరు వేల మందిలో 3,400 మంది మాత్రమే తిరిగి జైలుకు వచ్చారు.
పెరోల్ పై వెళ్లి....
మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుండటంతో జైలు అధికారుల్లో ఆందోళన మొదలయింది. వీరిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది కూడా ఐదువేల మంది పెరోల్ పై వెళ్లారు. కరోనా వైరస్ విజృంభించడంతో పెద్దయెత్తున ఖైదీలకు పెరోల్ లభించింది. ఖైదీలు తిరిగి రాకపోవడంతో వారి ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ పోలీసులు బహుమానం ప్రకటించింది.
Next Story