Sun Dec 22 2024 15:04:00 GMT+0000 (Coordinated Universal Time)
JN.1 Variant : మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. పెరుగుతున్న కేసులు మరణాలు..
దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో ఇండియా వైడ్..
JN1 Variant : దేశవ్యాప్తంగా కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. JN.1 అనే కొత్త వేరియంట్ ప్రజలని మళ్ళీ భయబ్రాంతులకు గురి చేస్తుంది. భారత్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతూ మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తుంది. గడిచిన 24 గంటల్లో ఇండియా వైడ్ 358 కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2669 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
దక్షణాది రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు సంఖ్య పెరుగుతూ పోతుంది. కేరళలో నిన్న ఒక్క రోజే 19 కేసులు నమోదు కాగా ముగ్గురు మృతి చెందారు. అత్యధికంగా కేరళలో 2341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దాని తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇక తెలంగాణలో నిన్న ఐదు కేసులు నమోదు కాగా ప్రస్తుతం 14 యక్టీవ్ కేసులు ఉన్నాయి. ఏపీలో ఒక్క యాక్టీవ్ కేసు మాత్రమే ఉంది.
ఇక పెరుగుతున్న కేసులు దృష్ట్యా ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యి ప్రజలను హెచ్చరిస్తున్నాయి. మాస్క్ లు తప్పనిసరి అని చెబుతున్నాయి. ప్రజలంతా జాగ్రత్త వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని కోరుతున్నారు. ఈ కొత్త వేరియంట్ పై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిశోధన చేస్తున్నట్లు, భయాందోళన గురి కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
కాగా ఎవరైనా జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఛాతిలో నొప్పి మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తక్షణమే డాక్టర్స్ ని సంప్రదించాలని కోరుతున్నారు. ఈ కొత్త వేరియంట్ నుంచి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మరణిస్తున్న వారు గుండె సంబంధిత వ్యాధులు లేదా షుగర్ సమస్య ఉన్నవారే ఎక్కువ అని చెబుతున్నారు.
Next Story