Mon Dec 23 2024 11:30:45 GMT+0000 (Coordinated Universal Time)
పది రెట్లు వేగంగా వ్యాపించే కొత్త కరోనా వేరియంట్.. భారత్ లో గుర్తింపు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై ఢిల్లీ ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో యాక్టివ్
ఢిల్లీ : కరోనా మహమ్మారిని కట్టడి చేశామని మనం ఓ వైపు సంబరపడిపోతూ ఉన్నా.. కొత్త వేరియంట్స్ కు సంబంధించిన వార్తలు మనల్ని కలవరపెడుతూనే ఉన్నాయి. 4వ వేవ్ గురించి మరో టెన్షన్ పెట్టే వార్త బయటకు వచ్చింది. బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించారు. ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఐజీఐఎంఎస్)లో ఈ కొత్త వేరియంట్ బీఏ.12 బయటపడింది. ఇది కరోనా థర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 సబ్ వేరియంట్కంటే పదిరెట్లు ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశారు. 13 శాంపిళ్లను పరీక్షించగా.. అందులో ఒకటి బీఏ.12 సబ్ వేరియంట్‌గా గుర్తించారు. మిగతా 12 శాంపిళ్లు బీఏ.2 సబ్ వేరియంట్ అని మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ నమ్రతా కుమారి వెల్లడించారు. ఇది బీఏ.2కంటే పదిరెట్లు ప్రమాదకరమని తెలిపారు. బీఏ.12 సబ్ వేరియంట్‌ను మొదట యూఎస్‌లో గుర్తించారు. ఢిల్లీలో ఈ సబ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు వెలుగుచూశాయి. కొత్త సబ్ వేరియంట్ల కారణంగా ఇప్పటికే పలు దేశాలు కరోనా వైరస్ బారిన పడి అల్లాడిపోతూ ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో భారత్ లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనే ఆందోళన ప్రజల్లో ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై ఢిల్లీ ఆరోగ్యశాఖమంత్రి సత్యేంద్ర జైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. చాలా తక్కువ మంది మాత్రమే ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్నారన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 5వేల మంది యాక్టివ్ కేసులున్నాయని, ఇందులో చాలా తక్కువ మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఆసుపత్రుల్లో 10వేల బెడ్లు అందుబాటులో ఉన్నాయని, ఇందులో కేవలం వంద పడకలు మాత్రమే నిండాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 4వేల 169 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా ఐదుగురికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో మూడు కేసులు వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఒకటి, నెల్లూరు జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.
Next Story