Sun Dec 22 2024 22:51:51 GMT+0000 (Coordinated Universal Time)
కొత్త పెళ్లి కూతురు.. నాలుగు నెలల గర్భవతి అని తెలియగానే..!
నవ వధువుకు వివాహమై ఒకటిన్నర నెలలే అవుతుండగా
ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌లో నవ వధువుకు వివాహమై ఒకటిన్నర నెలలే అవుతుండగా, ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలియడంతో అత్తమామలు, భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఆ సమయంలో వైద్యులు కొత్త పెళ్ళికొడుకుకు షాకింగ్ విషయం చెప్పారు. ఆమె గర్భం దాల్చిన విషయం వెలుగులోకి వచ్చింది. సోనోగ్రఫీ తర్వాత, ఆమె బిడ్డకు జన్మనిస్తోందని ఆమె అత్తమామలకు తెలిసింది. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు నిరాకరించారు.
ఆమె భర్త పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. గ్రామానికి చెందిన బంధువు ద్వారా పొరుగు జిల్లాకు చెందిన బాలికతో నెలన్నర క్రితం వివాహం జరిగిందని పేర్కొన్నాడు. అయితే గర్భంతో ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారని తనకు ఇప్పుడు తెలిసిందని వాపోయాడు భర్త. అమ్మాయి మరియు ఆమె తల్లిదండ్రులను మోసం చేశారని ఆరోపించారు. ఆమె గర్భం దాల్చిన విషయం వారికి ముందే తెలుసని.. అయితే నిజం దాచిపెట్టారని ఆరోపించారు. ఈ ఘటనను పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు కొల్హుయ్ ఎస్హెచ్ఓ అభిషేక్ సింగ్ తెలిపారు.
News Summary - Newlywed bride found 4-month pregnant husband files complaint
Next Story