Fri Mar 28 2025 14:14:07 GMT+0000 (Coordinated Universal Time)
Kerala : కేరళలో ఆ ప్రాంతానికి వెళితే మాస్క్ లు ధరించాల్సిందే... నిఫా వైరస్ పొంచి ఉంది
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతుంది. అనేక జిల్లాలలో నిఫా వైరస్ బారిన పడటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతుంది. అనేక జిల్లాలలో నిఫా వైరస్ బారిన పడటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయింది. బోయ్..కేరళ లో మరోమా కేరళలో నిఫా వైరస్ ముప్పుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కేరళ ప్రభుత్వం హై అలర్ట్ ను జారీచేసింది. ప్రధానంగా ఐదు జిల్లాల్లో నిఫా వైరస్ ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ ఐదు జిల్లాలను హై రిస్క్ జిల్లాలుగా ప్రకటించారు. కేరళ రాష్ల్రంలోని కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వయనాడ్ ,ఎర్నాకుళం జిల్లాలను ఈ ఇన్ ఫెక్షన్ కు హాట్స్పాట్లుగా ఆరోగ్య శాఖ గుర్తించడం విశేషం.
ఐదు జిల్లాల్లో అప్రమత్తం...
దీంతో ఈ ఐదు జిల్లాల్లో కేరళ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను పెంచింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిఫా వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్నందున తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. రాష్ట్రంలో తొలిసారిగా నిఫా వైరస్ 2018 సంవత్సరంలో కనిపించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తర్వాత వరసగా 2019 నుంచి 2021, 2023, 2024 సంవత్సరాల్లో నిఫా కేసులు కేరళ రాష్ట్రంలో బయటపడ్డాయి.నిఫా వైరస్ గబ్బిలాలతో పాటు కుక్కలు, మేకలు, పందుల వంటి వాటితో సోకే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు కూడా సులభంగా సోకే అవకాశముండటంతో కేరళ సర్కార్ అలెర్ట్ అయింది.
వైరస్ ప్రభావంతో...
నిఫా వైరస్ ప్రభావంతో పర్యాటక రంగంపై పడే అవకాశముండటంతో టూరిజం ప్లేస్లలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇక్కడ హోటళ్లు, రిసార్టులు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. మొత్తం మీద కేరళలో ఉన్న నిఫా వైరస్ తో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. తమ రాష్ట్రంలోకి ఈ వైరస్ ప్రవేశించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కేవలం ప్రభుత్వమే కాకుండా ఏ మాత్రం ప్రజలు కూడా వైరస్ ను వ్యాప్తి చెందకుండా సహకించాలని కోరుతున్నారు. వ్యాధి సోకిన వ్యక్తి జ్వరం, తలనొప్పి, మైయాల్జియా, గొంతు నొప్పి మరియు వాంతులు వంటి ప్రారంభ లక్షణాలుంటయని చెబుతున్నారు. మాస్క్ లు ధరించడం మేలని, ఈ ఐదు జిల్లాల్లో మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని వైద్య శాఖ అధికారులు సూచించారు.
Next Story