Sat Nov 23 2024 00:50:27 GMT+0000 (Coordinated Universal Time)
లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి షాక్
బ్యాంకులను మోసగించి కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోదీకి అక్కడి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది
బ్యాంకులను మోసగించి కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన నీరవ్ మోదీకి అక్కడి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది. దీంతో నీరవ్ మోదీకి న్యాయపరంగా ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయి. భారత్ కు నీరవ్ మోదీని అప్పగించేందుకు మార్గం సుగమమయింది. సుమారు పదకొండు వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడి నీరవ్ మోదీ లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే.
భారత్ కు తీసుకొచ్చేందుకు...
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి పరారయిన నీరవ్ మోదీని భారత్ కు రప్పించేందుకు అనేక రకాల ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. 2018 లో పరారయిన నీరవ్ మోదీని భారత్ కు తీసుకువచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత ప్రభుత్వం చేసిన చర్యల వల్ల 2019లో నీరవ్ మోదీ లండన్ లో అరెస్టయ్యారు. తనను భారత్ కు అప్పగించ వద్దంటూ పలుమార్లు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించాడు. అయితే తాజాగా సుప్రీంకోర్టకు వెళ్లాలన్న ఆయన పిటీషన్ ను లండన్ హైకోర్టు కొట్టివేయడంతో భారత్ కు తీసుకువచ్చేందుకు కొంత సానుకూలత ఏర్పడినట్లేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- nirav modi
- london
Next Story