Wed Apr 02 2025 15:38:06 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. జనతాదళ్ యు సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు. జనతాదళ్ యు శాసనసభ పక్ష సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో బీహార్ రాజకీయాల్లో ఒక క్లారిటీ వచ్చింది. ఆయన మరికాసేపట్లో గవర్నర్ ను కలసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు.
సాయంత్రం మరోసారి...
కాంగ్రెస్, ఆర్జేడీ కూటమితో కలసి ఇప్పటి వరకూ అంటే దాదాపు రెండేళ్ల పాటు పాలన సాగించిన నితీష్ కుమార్ జరుగుతున్న పరిణామాలతో కలత చెంది ఆ కూటమిని వీడి బయటకు వచ్చారు. బీజేపీతో కలసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Next Story