Fri Dec 20 2024 21:56:38 GMT+0000 (Coordinated Universal Time)
తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం
బీహార్ ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో నితీష్ కుమార్తో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసి దేశంలోనే నితీష్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రాజ్ భవన్లో ఆదివారం రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ ఉప ముఖ్యమంత్రులుగా నితీశ్తో పాటు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. జనతాదళ్ (యునైటెడ్) నాయకులు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావన్ కుమార్ కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఈసారి నితీష్ కుమార్, బీజేపీతో పొత్తు జతకట్టారు. జనవరి 28.. ఉదయం నితీష్ కుమార్ గవర్నర్ కు రాజీనామా సమర్పించారు. సాయంత్రం నాటికి బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహఘటబంధన్ లో 18 నెలల క్రితం చేరిన నితీష్ కుమార్.. ఇటీవల బీహార్ లో ఏర్పడిన రాజకీయ పరిణామాలతో మహాఘటబంధన్ నుంచి వైదొలిగారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమికి ఇది పెద్ద దెబ్బే. బీజేపీ నేత డాక్టర్ ప్రేమ్ కుమార్, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
Next Story