Fri Dec 20 2024 22:32:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మళ్లీ సీఎంగా నితీష్
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలసి ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిసింది. మహాకూటమిని ఏర్పాటు చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. కాంగ్రెస్ కు స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది.
డిప్యూటీ సీఎంగా...
ఎన్డీఏతో ఇన్నాళ్లూ కొనసాగిన నితీష్ కుమార్ నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఏడు పార్టీల కూటమితో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో కొత్త ప్రభుత్వంలోనూ నితీష్ కుమార్ సీఎంగా మరోసారి ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి అతి కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు.
Next Story