Mon Dec 23 2024 03:54:38 GMT+0000 (Coordinated Universal Time)
LPG eKYC: వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్
LPG సిలిండర్ల కోసం eKYC ప్రమాణీకరణ ప్రక్రియను పూర్తీ చేయడానికి
LPG సిలిండర్ల కోసం eKYC ప్రమాణీకరణ ప్రక్రియను పూర్తీ చేయడానికి ఎటువంటి గడువు లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. గ్యాస్ వినియోగదారుల ఈకేవైసీ గడువుకు ఎలాంటి డెడ్ లైన్ లేదన్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద మాత్రమే ఈకేవైసీ నమోదు చేయాలని కొన్ని కంపెనీలు పట్టుబడుతున్నాయని కేరళ శాసన సభ ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ రాసిన లేఖపై కేంద్రమంత్రి స్పందించారు. మస్టరింగ్ తప్పనిసరి అయితే, సంబంధిత గ్యాస్ ఏజెన్సీల వద్దే చేయాలని కోరడం వల్ల సాధారణ ఎల్పిజి హోల్డర్లకు అసౌకర్యం కలుగుతోందని సతీశన్ లేఖలో ప్రస్తావించారు.
బోగస్ ఖాతాలను తొలగించడానికి, వాణిజ్య సిలిండర్ల మోసపూరిత బుకింగ్‌ను నిరోధించడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి కస్టమర్ల కోసం ఇకెవైసి ఆధార్ ప్రమాణీకరణను అమలు చేస్తున్నాయని హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఈ ప్రక్రియ ఎనిమిది నెలలకు పైగా అమలులో ఉందని, నిజమైన వినియోగదారులకు మాత్రమే ఎల్పిజి సేవలు అందేలా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పూరీ స్పష్టం చేశారు. ఎల్పీజీ డెలివరీ సిబ్బంది గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేసే సమయంలోనే కస్టమర్ల వివరాలను వెరిఫై చేస్తారని తెలిపారు. వారి మొబైల్ ఫోన్లలోని యాప్‌తో వినియోగదారుల ఆధార్ వివరాలను నమోదు చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని తెలిపారు. కస్టమర్ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి OTPని అందుకుంటారన్నారు. కస్టమర్లు తమ సౌలభ్యం మేరకు డిస్ట్రిబ్యూటర్ షోరూమ్‌ను కూడా సంప్రదించవచ్చని హర్దీప్ సింగ్ పూరి వివరించారు. కస్టమర్లు కూడా OMC యాప్‌లను ఇన్స్టాల్ చేసుకోవచ్చని.. e KYCని స్వంతంగా పూర్తి చేయవచ్చన్నారు.
Next Story