Fri Nov 15 2024 20:19:18 GMT+0000 (Coordinated Universal Time)
ముఖ్యమంత్రి ఇంటికి కూడా కరెంట్ ఇచ్చేది లేదు
కరెంట్ లేక పుదుచ్చేరి అంధకారంలో మునిగిపోయింది. సాయంత్రం 6 గంటల తర్వాత కరెంట్ లేకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ ఇళ్లకు సైతం విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇందుకు కారణం విద్యుత్ కార్మికులు చేస్తున్న సమ్మె..! విద్యుత్ కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె తీవ్ర రూపం దాల్చింది. పుదుచ్చేరి ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ పంపిణీ, రిటైల్ వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి మొత్తం విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి.
కరెంట్ లేక పుదుచ్చేరి అంధకారంలో మునిగిపోయింది. సాయంత్రం 6 గంటల తర్వాత కరెంట్ లేకపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి. ఈ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు జనం కూడా రోడ్లపైకి వచ్చారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఇప్పటికే 100 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. రంగస్వామి ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో పోలీసులు, ఇతర సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దింపి విద్యుత్ పునరుద్ధరణ చేపట్టింది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉన్నతాధికారులు కూడా పుదుచ్చేరి చేరుకుని ఆందోళనకారులతో చర్చిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నమశ్శివాయం చెప్పారు.
Next Story