Mon Nov 18 2024 08:39:35 GMT+0000 (Coordinated Universal Time)
రేసు నుండి తప్పుకున్న అశోక్ గెహ్లాట్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల బరి నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయనే స్వయంగా ప్రకటన చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల బరి నుంచి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఆయనే స్వయంగా ప్రకటన చేశారు. నేడు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో గెహ్లాట్ భేటీ అయ్యారు. సోనియా గాంధీని క్షమాపణలు కోరిన గెహ్లాట్... పార్టీ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయలేనని చెప్పారు. సోనియాకు రాజస్థాన్ పరిణామాలపై ఆయన క్షమాపణ చెప్పారు. రాజస్థాన్ రాజకీయ పరిణామాలు తనను తీవ్రంగా కలచివేశాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి గెహ్లాట్ తప్పుకున్న నేపధ్యంలో ఇక ఇద్దరు నేతల మధ్యే పోటీ నెలకొంది. కేంద్ర మాజీ మంత్రులు దిగ్విజయ్ సింగ్, శశి థరూర్ల మధ్యే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది.
అధ్యక్ష రేసులో అందరికంటే ముందు వరుసలో ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల్లో దిగ్విజయ్, థరూర్లు ఇద్దరే నిలిచారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం దిగ్విజయ్ నేరుగా శశి థరూర్ నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో తామిద్దరమే పోటీ పడుతున్నామని థరూర్ చెప్పుకొచ్చారు. దిగ్విజయ్ అభ్యర్థిత్వాన్ని తాను స్వాగతిస్తున్నానని థరూర్ చెప్పారు. ఎన్నికల్లో తమది ప్రత్యర్థుల మధ్య పోరు కాదనీ, సహచరుల మధ్య స్నేహపూర్వక పోటీ మాత్రమేనని ఇద్దరం అంగీకరించామన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అది కాంగ్రెస్ విజయమేనని శశి థరూర్ చెప్పుకొచ్చారు.
Next Story