Mon Dec 23 2024 11:33:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎన్.ఎస్.జి. కమాండో పై నలుగురు దాడి.. ఆ తర్వాత ఏమి జరిగిందంటే..!
గురుగ్రామ్ లో ఎన్.ఎస్.జి. కమాండోపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. చిన్న గొడవ కాస్తా.. పెద్దదై ఎన్ఎస్జి కమాండోపై నలుగురు వ్యక్తులు దాడి చేశారని పోలీసులు మంగళవారం తెలిపారు. ఖేర్కి దౌలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌కు చేదనిన చున్ను అన్సారీ.. మనేసర్‌లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) సెంటర్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నాడు. అతను సోమవారం సాయంత్రం కొంత ఆహారాన్ని తీసుకుని రావడానికి సెక్టార్ 80లోని ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ అవుట్‌లెట్‌కి వెళ్లాడు. సాయంత్రం 6 గంటలకు అతను అవుట్లెట్ నుండి బయటకు వస్తుండగా, కారులో నలుగురు వ్యక్తులు రోడ్డుకు అడ్డుగా ఉన్నారని అన్సారీ తన ఫిర్యాదులో తెలిపారు. కారులో ఉన్నవారు మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు.
అన్సారీ కారును పక్కన పెట్టమని వారిని కోరడంతో, అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. ఆ తరువాత తనని కొట్టారని చున్ను అన్సారీ ఆరోపించారు. నిందితుల్లో ఒకరి పేరు లక్ష్య కటారియా అని తనకు తెలిసిందని ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. నలుగురు వ్యక్తులు సంఘటనా స్థలం నుండి పారిపోయే ముందు చంపేస్తామని కూడా బెదిరించారని ఆరోపించారు చున్ను అన్సారీ. నలుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 323 (బాధ కలిగించడం) మరియు 506 (నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. "మేము ప్రధాన నిందితుడు లక్ష్య కటారియాను అరెస్టు చేసాము, అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇతర నిందితుల పాత్రను మేము ధృవీకరిస్తున్నాము" అని ఖేర్కి దౌలా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) రాజేందర్ సింగ్ తెలిపారు.
Next Story