Mon Apr 21 2025 15:05:37 GMT+0000 (Coordinated Universal Time)
మహా కుంభమేళాలకు పోటెత్తుతున్న భక్తులు
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారు

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారు. అమృతస్నానాలు ముగిసినా రద్దీ కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే కోటిన్నర మంది పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ వరకూ మాత్రమే మహా కుంభమేళా జరుగుతుండటంతో పాటు ఇంకా ఎనిమిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో భక్తులు రోజుకు కోటి మందికి తక్కువ కాకుండా వస్తున్నారు.
యాభై కోట్ల మంది...
ఇప్పటివరకు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో 53 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్లు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దేశం నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లు, బస్సులు ద్వారా ప్రయాగ్ రాజ్ కు చేరుకునే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా యూపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. స్నాన ఘట్టాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
Next Story