Sat Dec 28 2024 17:29:34 GMT+0000 (Coordinated Universal Time)
శబరిమలకు లక్షల్లో భక్తులు
శబరిమలకు ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగింది. లక్షల సంఖ్యలో భక్తులు నిన్న శబరిమలకు చేరుకున్నారు.
శబరిమలకు ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగింది. లక్షల సంఖ్యలో భక్తులు నిన్న శబరిమలకు చేరుకున్నారు. కంపార్ట్మెంట్లన్నీ అయ్యప్ప భక్తులతో నిండిపోయాయి. నిన్న రాత్రికే లక్షల సంఖ్యలో శబరిమలకు భక్తులు చేరుకోవడంతో ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. కొండకు చేరుకునే వారి సంఖ్య లక్షల్లోనే ఉంది.
ట్రాఫిక్ జామ్...
దీంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. అయ్యప్పను దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో ఒక్కసారిగా భక్తులు చేరుకోవడంతో ప్రతి చోటా రద్దీ కనిపిస్తుంది. దీంతో అదనపు పోలీసులతో భద్రతను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది.
Next Story