Tue Nov 19 2024 05:43:09 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తొలి భారతీయుడు
భారత్ లో ఒమిక్రాన్ కేసులు 25కి చేరుకోగా.. ఇది సోకిన మొదటి వ్యక్తి కోలుకున్నాడు.
ప్రస్తుతం 57 దేశాలను వణికిస్తోన్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్. సౌతాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్.. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. ఇది సోకిన వారిలో పెద్దగా లక్షణాలు లేకపోయినప్పటికీ.. చాలా వేగంగా వ్యాపిస్తుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరించారు. దీనివల్ల ప్రమాదం తక్కువే కదా అని లైట్ తీసుకుంటే.. ఇక అంతే సంగతులని అమెరికా వైద్యులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. భారత్ లో ఒమిక్రాన్ కేసులు 25కి చేరుకోగా.. ఇది సోకిన మొదటి వ్యక్తి కోలుకున్నాడు.
శుభసూచికమే....
ఇది శుభసూచికంగా భావిస్తున్నారు వైద్యులు. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయిన తొలి వ్యక్తి దాని బారి నుంచి కోలుకోవడంతో వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల అతనికి చేసి కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బుధవారం రాత్రి అతడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గం వెల్లడించింది. ప్రజలు ఎక్కడికెళ్లినా మాస్కులు ధరించడం అలవాటు చేసుకోవాలని, అలాగే భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని, అప్పుడే ఒమిక్రాన్ ను జయించగలుగుతామని వైద్యులు సూచించారు
Next Story