Wed Jan 15 2025 18:02:53 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ ను ఊపేస్తున్న ఒమిక్రాన్.. ఎన్ని కేసులంటే?
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుంది.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అనేక రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుంది. దీంతో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు దిశగా చర్యలు ప్రారంభించాయి. తాజాగా దేశంలో 89 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361 చేరుకుంది. మొన్నటి వరకూ ఒకటి రెండు కేసులు నమోదయితే నిన్నటి నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
ఆంక్షల దిశగా....
మొత్తం 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కూడా కేసులు నమోదవుతుండటంతో పర్యాటక ప్రాంతాలపై ఆంక్షలను విధించారు. గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కావడంతో ఈ కేసుల సంఖ్య మరింత పెరుగుతుందన్న అంచనాలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉంది. అందుకే అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
Next Story