Fri Nov 22 2024 19:38:43 GMT+0000 (Coordinated Universal Time)
నుపుర్ శర్మ ఎక్కడ..?
టీవీ డిబేట్లో మాట్లాడుతూ ముహమ్మద్ ప్రవక్త వ్యక్తిగత జీవితంపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర
టీవీ డిబేట్లో మాట్లాడుతూ ముహమ్మద్ ప్రవక్త వ్యక్తిగత జీవితంపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. ఆ వ్యాఖ్యలను ముస్లిం సంఘాలతో పాటు 15 ఇస్లాం దేశాలు ఖండించాయి. గల్ఫ్ దేశాలు సైతం అక్కడున్న భారతీయ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేశారు. నుపుర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు ఆమె వ్యాఖ్యలను సైతం ఖండించింది బీజేపీ. తన వ్యాఖ్యలపై భేషరతు క్షమాపణలు చెప్పారు నుపుర్ శర్మ.
ఆమెపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం నుపుర్ శర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గత ఐదు రోజులుగా ఆమె జాడ తెలియరావడం లేదని ముంబై పోలీసులు చెప్తున్నారు. ముంబైతో పాటు ఢిల్లీ, కోల్‌కతా పోలీసులు సైతం ఆమె ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నుపుర్ శర్మ జాడ తెలియరాలేదని, ముంబై పోలీసులు గత నాలుగు రోజులుగా ఢిల్లీలో ఆమె కోసం వెతుకుతున్నారని మహారాష్ట్ర హోం శాఖ వర్గాలు తెలిపాయి. ముంబై పోలీసుల పైడోనీ పోలీస్ స్టేషన్ నుపుర్ శర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. శర్మను అరెస్టు చేయడానికి పోలీసుల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని హోం శాఖ వర్గాలు తెలిపాయి. ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు గాను నుపుర్ శర్మపై ముంబై పోలీసులు కాకుండా థానే పోలీస్ కమిషనరేట్‌లో కేసులు నమోదయ్యాయి.
నుపుర్ శర్మకు గతంలో ఆమెకు ఇమెయిల్‌లో సమన్లు వచ్చాయి. ఇప్పుడు భౌతిక కాపీని ఆమెకు ఇవ్వడానికి పోలీసు బృందాన్ని పంపారు. రజా అకాడమీ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు శర్మపై కేసు నమోదు చేశారు. నూపుర్ శర్మకు సమన్లు అమలు చేయడంలో ఢిల్లీ పోలీసులు సహకరించడం లేదని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ చెప్పుకొచ్చారు.
అప్పటి అధికార బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ఒక టీవీ చర్చ సందర్భంగా మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. చర్చలోని క్లిప్ వైరల్ కావడంతో, ఖతార్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌తో సహా 14 దేశాలు ఈ వ్యాఖ్యలపై భారతదేశాన్ని నిందించారు. నష్టాన్ని నియంత్రించే ప్రయత్నంలో బీజేపీ నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
News Summary - Nupur Sharma untraceable says Maharashtra govt
Next Story