Tue Nov 05 2024 16:25:47 GMT+0000 (Coordinated Universal Time)
రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్
ఈ నేపథ్యంలో అసలు ప్రమాదానికి కారణమెవరు ? అన్నదానిపై విచారణ చేస్తున్నారు. ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలవగా..
ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన ఘటనపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ రైలు ప్రమాదంలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ 290 మందికి పైగా మరణించగా.. 1100 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అసలు ప్రమాదానికి కారణమెవరు ? అన్నదానిపై విచారణ చేస్తున్నారు. ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలవగా.. అందులో రైల్వేలో రిస్క్అండ్ సేఫ్టీ కొలమానాలను విశ్లేషించి సూచనలు జారీ చేసేలా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని పిటిషన్ లో కోరారు.
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో నిపుణులను సభ్యులుగా ఏర్పాటు చేసేలా ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆ నివేదికను నేరుగా సుప్రీంకు అందేలా చూడాలని కోరారు. ఇదిలా ఉండగా.. ప్రమాదానికి కారణమేంటో తెలుసుకున్నామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. పూర్తిస్థాయి నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు సమీప ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
Next Story