Mon Dec 23 2024 04:40:10 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమాదానికి మూలకారణాన్ని గుర్తించాం : రైల్వే మంత్రి
ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో మార్పు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు మీడియాకు..
ఒడిశాలో కోరమాండల్ రైలు ప్రమాదానికి దారితీసిన మూలకారణాన్ని గుర్తించామని కేంద్ర రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో మార్పు వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఘటనా ప్రాంతంలో కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘోర దుర్ఘటనకు దారుతీసిన పరిస్థితులపై రైల్వే భద్రతా విభాగ కమిషనర్ విచారణ చేసినట్లు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన తప్పిదాన్ని కనిపెట్టారని, అందుకు బాధ్యులెవరో కూడా గుర్తించారని తెలిపారు. ఇంకా పూర్తి నివేదిక రావాల్సి ఉందని, పూర్తిస్థాయి నివేదిక అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు, అక్కడి పునరుద్ధరణ పనులపైనే దృష్టి సారించామన్నారు. బుధవారం ఉదయానికల్లా పునరుద్ధరణ పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. బోగీలలో మృతదేహాలన్నింటినీ తొలగించినట్లు వెల్లడించారు.
మృతదేహాలు మూడు రోజులుగా ఆసుపత్రుల్లో, ప్రమాద స్థలంలో ఉండిపోవడంతో కుళ్లిన స్థితికి చేరుకుంటున్నాయి. 172 మృతదేహాలను భువనేశ్వర్ ఆసుపత్రికి తరలించగా.. 57 మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించారు. భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో 100, ఎస్ యూఎం ఆసుపత్రిలో 20, కిమ్స్ లో 20, క్యాపిటల్ ఆసుపత్రిలో 16, ఏఎంఆర్ఐలో 6 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఏపీవాసి కూడా ఉండగా.. అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
Next Story