Mon Nov 25 2024 00:44:03 GMT+0000 (Coordinated Universal Time)
అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం
అరుణాచల్ ప్రదేశ్ లోని పొంగిన్ కు ఉత్తర ప్రాంతంలో 1174 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు
అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం సంభవించిది. అరుణాచల్ ప్రదేశ్ లోని పొంగిన్ కు ఉత్తర ప్రాంతంలో 1174 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు నిర్ధారించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.1 గా నమోదయింది. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అలాగే తమిళనాడులోని దిండిగల్ ప్రాంతంలోనూ భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు.
తమిళనాడులోనూ....
దిండిగల్ ప్రాంతంలో రెండు గంటల వ్యవధిలో మూడు సార్లు భూకంపం సంభవించింది. అయితే రిక్టర్ స్కేల్ పై 1.2 గా నమోదయింది. అయితే భూకంపం కారణంగా కొన్ని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడటం తప్ప మరెలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. భూకంపం సంభవించిన సమయంలో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
Next Story