Mon Dec 23 2024 23:53:07 GMT+0000 (Coordinated Universal Time)
వాయనాడ్ ఉప ఎన్నిక లేనట్లే
వాయనాడ్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ ఉప ఎన్నికపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు స్పందించారు.వాయనాడ్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడటంతో ఉప ఎన్నికలు జరపుతారా? అన్న ప్రశ్నకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు పై సమాధానమిచ్చారు. ఎన్నికలు జరపడానికి ఆరు నెలల సమయం ఉంటుందని వారు మీడియాకు వివరించారు.
కోర్టు తీర్పు తర్వాతే...
రాహుల్‌కు అప్పీల్‌కు వెళ్లడానికి న్యాయస్థానం ముప్ఫయి రోజుల సమయం ఇచ్చిందన్నారు. కోర్లు తీర్పు తర్వాతనే వాయనాడ్ ఉప ఎన్నికపై నిర్ణయం ఉంటుందని వారు తెలిపారు. ఏడాదికి ఎక్కువగా సమయం ఉన్నందున ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Next Story