Fri Dec 20 2024 16:53:45 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్....తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
చమురు కంపెనీలు ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాయి
చమురు కంపెనీలు ప్రజలకు గుడ్ న్యూస్ అందించాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు పెట్రోలు, గ్యాస్ సిలిండర్ల ధరలను సమీక్ష చేస్తాయి. జులై ఒకటో తేదీ కావడంతో సమీక్ష చేసి గ్యాస్ సిలిండర్ ధరలపై కొంత తగ్గించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
జులై ఒకటో తేదీ కావడంతో...
19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 31 రూపాయలు తగ్గించాయి. తగ్గిన ధరలు జులై 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. జూన్ 1వ తేదీన పందొమ్మిది రూపాయలు, మే 1వ తేదీన 30.50 రూపాయలుచొప్పున గతంలో కంపెనీలు తగ్గించాయి. ఇక గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పులు లేవు.
Next Story