Sun Nov 17 2024 05:39:35 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో .. ఈ బాదుడు ఆగేట్లు లేదే?
మార్చి 22వ తేదీ తర్వాత ఇప్పటి వరకూ 11 సార్లు చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి.
చమురు కంపెనీలు పెట్రో వడ్డింపు ఆపడం లేదు. వరసగా ఈరోజు కూడా పెట్రో ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన తర్వాత ఆయిల్ కంపెనీలు పెట్రోలు ధరలను పెంచలేదు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత వరసగా పెంచుకుంటూ పోతున్నాయి. మార్చి 22వ తేదీ తర్వాత ఇప్పటి వరకూ 11 సార్లు చమురు సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి.
హైదరాబాద్ లో.....
ఈరోజు పెట్రోలు లీటరు పై 80 పైసలు, డీజిల్ లీటరు పై 85 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 117.25 రూపాయలకు, లీటరు డీజిల్ ధర 103.32 రూపాయలకు చేరుకుంది. పెట్రోలు లీటరు 140 రూపాయలు పెంచాలన్న లక్ష్యంతో ఆయిల్ కంపెనీలు రోజుకు 80 పైసలు పైగానే పెంచుకుంటూ పోతున్నాయన్న విమర్శలున్నాయి.
Next Story