Mon Dec 23 2024 16:34:51 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ సీఎం ఓం ప్రకాశ్ కు నాలుగేళ్లు జైలు.. రూ.50 లక్షలు జరిమానా
చౌతాలా ఇప్పటికే ఒక కేసులో పదేళ్లు జైలు శిక్ష అనుభవించారు. అర్హత లేనివారిని హర్యానాలో ఉపాధ్యాయులుగా నియమించిన..
హర్యానా : హర్యానా మాజీ సీఎం, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ చౌతాలా కు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.50 లక్షలు జరిమానా విధిస్తూ.. ఢిల్లీ కోర్టు శుక్రవారం మధ్యాహ్నం సంచలన తీర్పును వెలువరించింది. ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్న కేసులో.. చౌతాలాకు చెందిన నాలుగు ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవాలని అధికార యంత్రాగానికి ఆదేశాలు జారీ చేసింది.
చౌతాలా ఇప్పటికే ఒక కేసులో పదేళ్లు జైలు శిక్ష అనుభవించారు. అర్హత లేనివారిని హర్యానాలో ఉపాధ్యాయులుగా నియమించిన కేసులో ఆయన దోషిగా నిర్థారించబడి.. పదేళ్లు శిక్ష పడింది. ఈ శిక్షాకాలం పూర్తయి.. గతేడాదే చౌతాలా జైలు నుంచి విడుదలయ్యారు. ఆ కేసు సమయంలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కూడా నమోదవ్వడం.. దాని విచారణను వేగవంతం చేయడంతో.. మరోమారు ఆయనకు నాలుగేళ్లు జైలు శిక్షతో పాటు రూ.50 లక్షలు జరిమానా విధించారు. గతవారమే ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తవ్వగా.. నేడు తీర్పును వెలువరించింది.
Next Story