Sun Apr 06 2025 01:52:04 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం
నేడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేయనున్నారు

నేడు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఒమర్ అబ్దుల్లాతో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఇండి కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చాలా రోజుల తర్వాత...
నేషనల్ కాన్ఫరెన్స్ అత్యధిక స్థానాలను సాధించడంతో ఒమర్ అబ్దుల్లాను శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, దానికి మద్దతు ఇచ్చే పార్టీల ముఖ్యమంత్రులకు ఒమర్ అబ్దుల్లా తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. సుదీర్ఘకాలం తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ కార్యకర్తలు పెద్దయెత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
Next Story