Sun Dec 22 2024 23:49:12 GMT+0000 (Coordinated Universal Time)
Loksabha Speaker : లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లా
లోక్సభ స్పీకర్ గా రెండోసారి ఓంబిర్లా ఎన్నికయ్యారు.
లోక్సభ స్పీకర్ గా రెండోసారి ఓంబిర్లా ఎన్నికయ్యారు. లోక్సభ సమావేశాలు ప్రారంభయిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ గా ఓం బిర్లా పేరును ప్రతిపాదించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఓంబిర్లా స్పీకర్ గా ఎన్నికయినట్లు ప్రొటెం స్పీకర్ ప్రకటించారు. ఓటింగ్ కు వెళ్లకుండానే ప్రొటెం స్పీకర్ సభ్యుల బలాబలాలను పరిశీలించిన మీదట ఓంబిర్లాను స్పీకర్ గా ఎన్నికయినట్లు తెలిపారు. 18వ లోక్సభ స్పీకర్ గా ఓంబిర్లా ఎన్నికయ్యారు.
మూజువాణీ ఓటుతో...
ఇండి కూటమి స్పీకర్ అభ్యర్థిగా సురేష్ పేరును ప్రతిపాదించినప్పటికీ సభ్యుల మద్దతు సరిపడా లేకపోవడంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లాను స్పీకర్ గా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓంబిర్లాను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. స్పీకర్ గా ఓంబిర్లా మూజువాణీ ఓటుతో స్పీకర్ గా ఎన్నికయినట్లు ప్రకటించారు.
Next Story