Mon Dec 23 2024 17:09:19 GMT+0000 (Coordinated Universal Time)
వంద మంది విద్యార్థులకు కరోనా
దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిపోతుంది.
దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిపోతుంది. తాజాగా పంజాబ్ లోని పటియాలా మెడికల్ కళాశాలలో కరోనా వైరస్ విజృంభించింది. ఈ మెడికల్ కళాశాలలో వంద మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. విద్యార్థులు, అధ్యాపకులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరికొంత మందికి కరోనా సోకే అవకాశముందని తేలింది.
న్యూ ఇయర్ వేడుకల వల్లనే....?
పంజాబ్ మెడికల్ కళాశాలలో ఇటీవల నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగానే కరోనా సోకినట్లు తేలింది. పంజాబ్ లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది.
Next Story