Tue Dec 24 2024 02:42:58 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అదే.. జర జాగ్రత్త..!
INSACOGతో అనుబంధం ఉన్న శాస్త్రవేత్తలు, ఈ కొత్త సబ్‌వేరియంట్ BA.2 కంటే మరింత వేగంగా కనిపిస్తుందని, ఇది అత్యంత వ్యాప్తి..
కొత్త SARS CoV 2 మ్యూటెంట్ BA. 2.12.1 కి సంబంధించిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2 లో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం వలన కరోనా కేసుల సంఖ్య ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంటూ ఉంది. ఢిల్లీనే కాకుండా ఆ చుట్టుపక్కన ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగడానికి కారణం కూడా ఇదేనని భారతదేశ కరోనావైరస్ జెనోమిక్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ - INSACOG తెలిపింది. INSACOG ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఏజెన్సీ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్, ఢిల్లీలో వేరియంట్‌ను గుర్తించినట్లు ధృవీకరించారు. కానీ దీని గురించి మరింత వివరించలేదు. గత కొన్ని రోజులుగా మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన నమూనాలలో BA.2.12.1 వేరియంట్ కనుగొనబడిందని తెలుస్తోంది.
BA.2.12.1, BA.2.12తో పాటు, Omicron BA.2 యొక్క ఇతర సబ్‌వేరియంట్, న్యూయార్క్‌లోని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో గుర్తించబడింది. కరోనా కేసుల పెరుగుదల వెనుక కారణం ఈ వేరియంట్ అని తేల్చారు. కాబట్టి భారత్ లో కూడా ఈ వేరియంట్ కారణంగా కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
INSACOGతో అనుబంధం ఉన్న శాస్త్రవేత్తలు, ఈ కొత్త సబ్‌వేరియంట్ BA.2 కంటే మరింత వేగంగా కనిపిస్తుందని, ఇది అత్యంత వ్యాప్తి చెందగల Omicron సబ్‌వేరియంట్ అని అన్నారు. జనవరిలో భారతదేశంలో కరోనా వ్యాప్తికి ఈ వేరియంటే కారణమైంది. "మా ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఢిల్లీలోని COVID-19 రోగుల నుండి సేకరించిన నమూనాలలో BA.2.12.1ని నిర్ధారించింది" అని NCDCలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. BA.2 లాగా, కొత్త మ్యూటెంట్ కూడా గతంలో SARS CoV వైరస్ సోకిన వ్యక్తులలో తిరిగి ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు.
COVID-19 నిఘా ప్రోగ్రామ్‌తో అనుబంధించబడిన మరొక శాస్త్రవేత్త న్యూయార్క్ నుండి వచ్చిన నివేదికలు BA.2.12 అని సూచిస్తున్నప్పటికీ. BA.2 సబ్‌వేరియంట్ కంటే 1 మరింత వ్యాప్తి చెందగలదని అన్నారు. కొత్త సబ్‌వేరియంట్ ఎపిడెమియోలాజికల్ ఇంప్లికేషన్స్ ను శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు, అయితే వ్యాక్సినేషన్, రోగనిరోధక శక్తి కారణంగా వైరస్ ప్రభావం చాలా తక్కువేనని అంటున్నారు.
కానీ కొంతమంది పరిశోధకులు మాత్రం.. ఈ వేరియంట్ కారణంగా కరోనా సోకిన మెజారిటీ ప్రజలలో కేవలం అప్పర్ రెస్పిరేటరీ ఇల్ నెస్ ను కలిగిస్తుంది.. ఊపిరితిత్తులను ప్రభావితం చేయదని సూచించారు. ఇప్పుడు భారతదేశంలో కూడా గుర్తించబడిన కొత్త సబ్‌వేరియంట్ BA.2.12.1, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ద్వారా ఆసక్తి యొక్క variant of interest (VoI) లేదా a variant of concern (VoC) గా ఇంకా ప్రకటించబడలేదు.
Next Story